31 వరకు స్పందన రద్దు

ABN , First Publish Date - 2020-03-23T10:34:05+05:30 IST

కరోనా కారణంగా జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమాన్ని ఈనెల 31 వరకు రద్దు చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.

31 వరకు స్పందన రద్దు

కర్నూలు(ఆంధ్రజ్యోతి), మార్చి 22: కరోనా కారణంగా జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమాన్ని ఈనెల 31 వరకు రద్దు చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాలకు రావద్దని కోరారు. కరోనా వ్యాపించకుండా సామాజిక దూరాన్ని పాటించేందుకు ఈనిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా కలెక్టరేట్‌లో డ్రాప్‌ బాక్స్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని రోజుల్లో ప్రజలు తమ అర్జీలను డ్రాప్‌ బాక్స్‌లలో వేసి వెళ్ళవచ్చని తెలిపారు. గుంపులుగా కాకుండా, ఒక్కరుగా రావాలని కో రారు. అర్జీ రశీదును, చర్యల వివరాలను వలం టీర్ల అర్జీదారుల ఇళ్లకు పంపుతామని తెలిపారు.

Updated Date - 2020-03-23T10:34:05+05:30 IST