బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-14T18:29:35+05:30 IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను..

బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

నందికొట్కూరు(కర్నూలు): కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి సోమవారం పటేల్ సెంటర్‌లో అధిక మందితో వచ్చి మైక్‌లో మాట్లాడారు. భౌతికదూరం పాటించకుండా హైపో ద్రావణం పిచికారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, లబ్బి వెంకటస్వామిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నాగరాజారావు తెలిపారు.

Updated Date - 2020-04-14T18:29:35+05:30 IST