-
-
Home » Andhra Pradesh » Kurnool » boundary bandh
-
సరిహద్దు బంద్
ABN , First Publish Date - 2020-03-24T11:07:44+05:30 IST
కరోనా కట్టడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జాతీయ రహదారి మీద ఏడు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.

జాతీయ రహదారిలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు
పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత
కర్నూలు, మార్చి 23: కరోనా కట్టడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జాతీయ రహదారి మీద ఏడు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సరిహద్దు రాష్ట్రాల చెక్‌పోస్టుల నుంచి రాకపోకలు నిలిపివేశారు. అటు తెలంగాణకు, ఇటు బెంగళూరుకు వెళ్లే వాహనాలు రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాలు టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన 90 మందిపై 19 కేసులు నమోదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప డీఎస్పీలతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు తిరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.