అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను ఆమోదించిం దని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిని అమలు చేయాలని బీజేపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి
నంద్యాలలో సంతకాలు సేకరిస్తున్న బీజేపీ నాయకులు

సంతకాల సేకరణ చేపట్టిన బీజేపీ నాయకులు

నంద్యాల టౌన్‌, నవంబరు 13: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను ఆమోదించిం దని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిని అమలు చేయాలని బీజేపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. బుడ్డా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయడంలేదని, దీనివల్ల అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా జోనల్‌ కార్యదర్శి సయ్యద్‌ముక్తార్‌ బాషా, బీజేపీ ఓబీసీ జిల్లా నాయకుడు శ్రీనివాసులు, హర్షవర్ధన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

నందికొట్కూరు: రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ నందికొట్కూరు పట్టణంలో భారతీ య జనతా యువమోర్చ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా యువ మోర్చా జిల్లా నాయకులు వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. నాయకులు శివప్రసాద్‌రెడ్డి, శ్రీదేవి, జయచంద్ర, నాగరాజు, బాషా, కిషోర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST