బీజేపీ నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2020-11-21T06:15:32+05:30 IST

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కర్నూలు వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ నాయకుల అరెస్టు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబరు 20: తుంగభద్ర పుష్కరాలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కర్నూలు వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరిని 24 గంటలు హౌస్‌ అరెస్టులో ఉంచారు. అలాగే బీజేపీ నాయకులు చెన్నయ్య, చింతలపల్లి రామక్రిష్ణ, సోమశేఖర్‌ తదితర నాయకులను అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన అనంతరం భేషరతుగా వదిలివేశారు. తుంగభద్ర పుష్కరాల స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీజేపీ నాయకులు తప్పు పట్టారు. హిందూ సాంప్రదాయ మనోభావాలను దెబ్బతీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల్లో స్నానాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని భక్తులకు పుష్కర ఘాట్‌లలో స్నానాలకు అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

Read more