బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-13T06:01:43+05:30 IST

పాములపాడు గ్రామ శివార్లలోని కేజీ రోడ్డుపై రెండు మోటర్‌ సైకిళ్ళు ఢీ కొన్నాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

పాములపాడు, నవంబరు 12: పాములపాడు గ్రామ శివార్లలోని  కేజీ  రోడ్డుపై రెండు మోటర్‌ సైకిళ్ళు ఢీ కొన్నాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.  మండలంలోని రుద్రవరం గ్రామం నుంచి  మోటర్‌ సైకిల్‌పై చంద్ర అతని భార్య ఆదిలక్ష్మి పాములపాడు వస్తుండగా గ్రామ శివార్లలో గల పెట్రోల్‌ బంకు నుంచి  టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మీద వస్తున్న మరో   వ్యక్తి వీరి మోటర్‌ సైకిల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయాడు.  ఈ ప్రమాదంలో భార్యా భర్తలిద్దరూ గాయపడ్డారు. వారిని   ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-11-13T06:01:43+05:30 IST