బైకు అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-20T05:12:42+05:30 IST

అవుకు పట్టణం సమీపంలో గురువారం రాత్రి బైకు అదుపుతప్పి మనోహర్‌, సురేష్‌, దస్తగిరి గాయపడ్డారు.

బైకు అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

అవుకు, నవంబరు 19: అవుకు పట్టణం సమీపంలో గురువారం రాత్రి బైకు అదుపుతప్పి మనోహర్‌, సురేష్‌, దస్తగిరి గాయపడ్డారు. కోవెలకుంట్ల మండలం, అమడాల గ్రామానికి చెందిన వీరు బంధువులకు వివాహ పత్రికలు పంచేందుకు బైకుపై వచ్చారు. తిరిగి వెళుతుండగా బైకు అదుపుతప్పి కింద పడ్డారు. ముగ్గురికి గాయాలు కావటంతో 108 ద్వారా బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-11-20T05:12:42+05:30 IST