10న కుంభోత్సవం

ABN , First Publish Date - 2020-03-18T11:31:40+05:30 IST

చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏది ముందు వస్తే ఆ రోజు భ్రమరాంబదేవికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తారు.

10న కుంభోత్సవం

భ్రామరికి  కొబ్బరికాయల సమర్పణ


శ్రీశైలం, మార్చి 17: చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో  ఏది    ముందు వస్తే ఆ రోజు  భ్రమరాంబదేవికి  కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు.


అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ఈ కుంభోత్సవం జరపడం అనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. స్వామివారి ఆలయ ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి కుంభోత్సవం రోజున స్త్రీ వేషం ధరించడం అచారంగా వస్తోంది. 

Updated Date - 2020-03-18T11:31:40+05:30 IST