పశు పోషణతో రైతుకు మేలు

ABN , First Publish Date - 2020-12-27T05:30:00+05:30 IST

రాయలసీమ కరువు పీడిత ప్రాంతమని, ఇక్కడి రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం మంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు.

పశు పోషణతో రైతుకు మేలు
బనవాసిలో వెటర్నరీ కళాశాలను ప్రారంభిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన

  1. విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం
  2. బనవాసిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
  3. వెటర్నరీ కళాశాల, పరిశోధనా కేంద్రం ప్రారంభం


ఎమ్మిగనూరు, డిసెంబరు 27: రాయలసీమ కరువు పీడిత ప్రాంతమని, ఇక్కడి రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం మంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు. అందుకే కరువుకాటకాలతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వ్యవసాయానికి తోడు పశువులను, జీవాలను పోషించుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. మండల పరిధిలో బనవాసి ఫారం వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, గొర్రెలు, మేకల పరిశోధనా కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. పూర్వం పశువులు మానవ జీవితాల్లో భాగంగా ఉండేవని అన్నారు. కొన్నేళ్ల క్రితం మార్పు వచ్చినా, మరోమారు పశు పోషణకు ప్రాధాన్యం పెరుగుతోందని అన్నారు. అందుకే ప్రభుత్వం పశుపోషణకు తోడ్పాడు ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, నాడు నేడు పథకంతో బడులను బాగుచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి, పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 16 మెడికల్‌ కళాశాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంత్రిని రాష్ట్ర వీరశైవ, కుర్ణి, వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌లు రుద్రగౌడ్‌, బుట్ట శారదమ్మ, డా.మధుసుదన్‌ ఘనంగా సన్మానించారు. గొర్రెలు, మేకలకు ప్రభుత్వం బీమాను కల్పించిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు. గొర్రెలు చనిపోతే గ్రామ సచివాలయాల్లో నమోదు చేయించుకోవాలని, ఒక్కో జీవానికి రూ.6 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-27T05:30:00+05:30 IST