ఎలుగు బంటి దాడి.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-04T05:21:30+05:30 IST

మండలంలోని చిన్న దేవళాపురం పొల్లాల్లో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు గాయపడ్డారు.

ఎలుగు బంటి దాడి.. ఇద్దరికి గాయాలు

బండి ఆత్మకూరు, డిసెంబరు 3: మండలంలోని చిన్న దేవళాపురం పొల్లాల్లో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు గాయపడ్డారు. గురువారం గ్రామానికి చెందిన అడ్డాకుల పుల్లయ్య, చిన్న పుల్లయ్య నల్లమల అటవీ సమీపంలోని పొలాల్లో పశువులు మేపేందుకు వెళ్లారు. మందలోని పశువు తప్పిపోయి అడవిలోకి వెళ్లడంతో అక్కడ పొదల్లో నుంచి వచ్చిన ఎలుగుబంటి ఇద్దరిపై దాడి చేసింది. అటవీ అధికారులు విచారిస్తున్నారు.


Updated Date - 2020-12-04T05:21:30+05:30 IST