-
-
Home » Andhra Pradesh » Kurnool » Be vigilant against corona
-
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి’
ABN , First Publish Date - 2020-03-24T11:16:20+05:30 IST
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో ప్రకాష్‌నాయుడు సూచించారు.

కోవెలకుంట్ల, మార్చి 23: కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో ప్రకాష్‌నాయుడు సూచించారు. ఆటోలను నిలిపివేసి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దుకాణాలపై దాడులు చేసి షాపులను సీజ్ చేసి 10 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.5వేల నుంచి రూ.10వేలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
కొలిమిగుండ్ల
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కొలిమిగుండ్ల పోలీసులు సోమవారం తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలో కనకాద్రిపల్లె, అంకిరెడ్డిపల్లె, కొలిమిగుండ్ల, బెలుం, చింతలాయిపల్లె, తిమ్మనాయునిపేట మొదలగు గ్రామాల పరిధిలో హెడ్‌కానిస్టేబుల్ బాబా ఫకృద్దీన్, ఏఎస్‌ఐ సలాంఖాన్ బృందాలు గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించారు.