అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-08-22T10:11:02+05:30 IST

శ్రీశైలం జలాశయాన్ని కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వాయిదా పడటం వల్ల వీరు వర

అప్రమత్తంగా ఉండండి

వచ్చే వారం ముఖ్యమంత్రి సందర్శించే అవకాశం 

జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ 


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 21: శ్రీశైలం జలాశయాన్ని కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వాయిదా పడటం వల్ల వీరు వరద, జలాశయం నిర్వహణపై జిల్లా అధికారులతో చర్చించారు. వచ్చే వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డ్యాం సందర్శన ఉంటుందని, అప్పటికల్లా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసులును ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి, జేసీ-2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, శ్రీశైలం ఈవో రామారావు, నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధిమీనా, ఆర్డీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-22T10:11:02+05:30 IST