‘బీసీ అధికారులపై ప్రభుత్వ వైఖరి సరైంది కాదు’
ABN , First Publish Date - 2020-12-12T05:14:51+05:30 IST
జిల్లాలో బీసీ అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి సరైంది కాదని అఖిల భారతీయ యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎన్ రాజు యాదవ్ డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 11: జిల్లాలో బీసీ అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి సరైంది కాదని అఖిల భారతీయ యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎన్ రాజు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకుడు జీ.నాగరాజు యాదవ్, టీడీపీ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ధరూర్ జేమ్స్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అకారణంగా డా.చంద్రశేఖర్‌ను బదిలీ చేయడం సరైంది కాదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నరేంద్రనాథ్ రెడ్డిని పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జనసేన నాయకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న డా.చంద్రశేఖర్‌ను అకారణంగా తొలగించిందన్నారు. అనంతరం లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు డేవిడ్ మాట్లాడారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జీ.అయ్యన్నయాదవ్, కురువ సంఘం నాయకులు నగేష్, ప్రజాపరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, బీసీ సంఘం నాయకుడు శేషఫణి యాదవ్, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా సెక్రటరీ చంద్రశేఖర్, ఏపీ విద్యార్థి యూనియన్ అధ్యక్షులు భాస్కర్ నాయుడు, మోహన్ పాల్గొన్నారు.