టీడీపీని వీడేది లేదు: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-19T11:33:43+05:30 IST

తెలుగుదేశం పార్టీని తాను వీడుతున్నట్లు..

టీడీపీని వీడేది లేదు: మాజీ ఎమ్మెల్యే

బనగానపల్లె(కర్నూలు): తెలుగుదేశం పార్టీని తాను వీడుతున్నట్లు వచ్చిన అసత్య ప్రచారాలను నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను టీడీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు. తాను ఏ వైసీపీ నాయకుడినీ కలవలేదన్నారు. కావాలనే తనపై అసత్యపు ప్రచారాలను చేశారన్నారు. టీడీపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. 

Updated Date - 2020-03-19T11:33:43+05:30 IST