‘వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-12-29T04:50:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్‌ బిల్లులను ఉపసంహరించుకోవాలని వ్యవసాయ సంఘాల నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు బసాపురం గోపాల్‌, వామపక్ష రైతు సంఘాల నాయకుడు వెంకటేశ్వర్లు డిమాం డ్‌ చేశారు.

‘వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలి’


ఆదోని, డిసెంబరు 28: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్‌ బిల్లులను ఉపసంహరించుకోవాలని వ్యవసాయ సంఘాల నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు బసాపురం గోపాల్‌, వామపక్ష రైతు సంఘాల నాయకుడు వెంకటేశ్వర్లు డిమాం డ్‌ చేశారు. సోమవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ముందు దీక్ష చేపట్టారు.  దీక్షల్లో తిక్కన్న, ప్రసాద్‌, మల్లికార్జున, శేఖర్‌, రామాంజనేయులు, ఈరన్నగౌడ్‌ పాల్గొన్నారు. 



ఆస్పరి: వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అధికార కేంద్ర బీజేపీ సర్కార్‌ తీసుకున్న వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, ఉపాధ్యక్షడు నాగేంద్రయ్య, హనుమంతు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ స్థానిక బస్టాండు ఆవరణలో రిలే నిహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఉరుకుందప్ప, బ్రహ్మయ్య, మధుసూధన్‌రెడ్డి, బాలకృష్ణ, అశోక్‌, ఇబ్రహీం, తిమ్మప్ప, మురళీ, వెంకటరాముడు పాల్గొన్నారు. 


దేవనకొండ: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతుసంఘం జిల్లా కార్యదర్శి జగదీష్‌ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముం దు రైతుసంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.  ఈ దీక్షల నందు రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, నాయకులు సురేంద్ర, మహేష్‌, సంపత్‌, విశ్వనాథ్‌, గంగన్న  కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు నల్లన్న, మహమ్మద్‌, నెట్టెకల్లు, రఫిక్‌, మోద్దీన్‌, మధు, రాజు  పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T04:50:51+05:30 IST