-
-
Home » Andhra Pradesh » Kurnool » balala scince congress brocher vidudala
-
బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దండి
ABN , First Publish Date - 2020-12-11T05:20:22+05:30 IST
విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

- ఉపాధ్యాయులకు డీఈవో పిలుపు
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 10: విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఇండస్ పాఠశాలలో గురువారం 28వ బాలల సైన్స్ కాంగ్రె్‌స బ్రోచర్‌ను సమగ్ర శిక్ష అభియాన్ అదనపు కో ఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్‌తో కలిసి విడుదల చేశారు. స్థానిక సమస్యలపై విద్యార్థుల చేత ప్రాజెక్టులు తయారు చేయించాలని డీఈవో సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వర్చవల్ పద్ధతిలో జిల్లా స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల వివరాలు, వాటిని తయారు చేసిన విద్యార్థి వివరాలు గూగుల్ లింక్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ప్రదర్శన 3 నుంచి 4 నిమిషాలకు మించకుండా వీడియో తయారు చేసి, ఆన్‌లైన్‌లో పంపాలని సూచించారు. జిల్లా స్థాయిలో 10 అత్యుత్తమ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక అవుతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో 17 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీల పంపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రంగమ్మ, అసిస్టెంట్ కో ఆర్డినేటర్స్ కేవీ సుబ్బారెడ్డి, గోపాల్, ఎస్‌ఏ హకీం పాల్గొన్నారు.