ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-24T11:19:40+05:30 IST

ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 15 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

రూ.15 లక్షలు ఇచ్చిన నిరుద్యోగి 


కోసిగి, మార్చి 23: ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 15 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోసిగిలోని సిద్ధప్ప పాలేనికి చెందిన వడ్ల పుల్లయ్య ఎంఏ వరకు చదువుకు న్నాడు.  ఉద్యోగం కోసం స్నేహితుడు రాజశేఖర్‌ బంధువు  అదిశేషులుకు  రూ. 15. 15 లక్షలు ఇచ్చాడు. కర్ణాటక రాష్ట్రం దార్వాడకు చెందిన ఆదిశేషులు 2015 నుంచి  2018 మధ్య పుల్లయ్య వద్ద రూ.15.15 లక్షలు తీసుకొని ఉద్యో గం ఇప్పించకుండా మోసం చేశాడు. ఈ విష యంలో బాధితుడు గత నెల 17న కోసిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు  సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుం జయ సోమవా రం నిందితుడ్ని ఆదోని మండలం కుప్పగల్‌ వాల్మీకి క్రాస్‌ వద్ద అరెస్టు చేశారు.  కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more