ప్రభుత్వ వైన్‌ షాపు ఉద్యోగుల అరెస్టు

ABN , First Publish Date - 2020-06-22T10:13:12+05:30 IST

మద్యం తరలిస్తున్న ప్రభుత్వ వైన్‌ షాపు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా

ప్రభుత్వ వైన్‌ షాపు ఉద్యోగుల అరెస్టు

మద్యం తరలిస్తుండగా  పట్టుకున్న పోలీసులు


ఆదోని రూరల్‌, జూన్‌ 21: మద్యం తరలిస్తున్న ప్రభుత్వ వైన్‌ షాపు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండు సమీపంలో ప్రభుత్వ వైన్‌షాపులో శశికాంత్‌రెడ్డి సూపర్‌వైజర్‌గా, విజయ్‌కుమార్‌ స్వీపర్‌ గా పనిచేస్తున్నారు. నిత్యం షాపులో నుంచి మద్యాన్ని తరలిస్తూ బయట అమ్ముతున్నారన్న సమాచారంతో వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వీరి కదలికలపై గట్టి నిఘా ఉంచారు. ఆదివారం రాత్రి నంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్ర వాహనంలో ప్రభుత్వ మద్యం తరలిస్తుండగా శ్రీనివాస్‌భవన్‌ దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 17 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2020-06-22T10:13:12+05:30 IST