ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-21T11:29:08+05:30 IST

జిల్లాలో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి  ఏర్పాట్లు పూర్తి :  కలెక్టర్‌

కర్నూలు(ఆంధ్రజ్యోతి), మార్చి 20: జిల్లాలో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లే అవుట్లు 93 శాతం సిద్ధం చేశామని, 83 శాతం నంబర్‌ రాళ్ళు కూడా వేశామని, లాటరీ ద్వారా 77 శాతం లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి కలెక్టర్‌ వివరించారు. కోర్టులో 60 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని,  అవి తర్వగా పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


Updated Date - 2020-03-21T11:29:08+05:30 IST