యువతిని మోసం చేసిన ఆర్మీ జవాన్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-11-27T05:27:55+05:30 IST

మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు.

యువతిని మోసం చేసిన ఆర్మీ జవాన్‌ అరెస్టు

మహానంది, నవంబరు 26: మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. ప్రేమించి మోసం చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంత కాలం నుంచి ఆర్మీ జవాన్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని చెప్పారని, అయితే పెళ్లి చేసుకోవాలని అడగడంతో అందుకు ఆర్మీ జవాన్‌ విజయ్‌కుమార్‌ అంగీకరించలేదని యువతి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని ఎస్‌ఐ తెలిపారు. ఆర్మీ జవాన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపర్చగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-11-27T05:27:55+05:30 IST