62 స్కానింగ్‌ కేంద్రాలకు ఆమోదం

ABN , First Publish Date - 2020-03-04T09:45:51+05:30 IST

జిల్లాలో 62 స్కానింగ్‌ కేంద్రాలకు కొత్తగా రిజిస్ర్టేషన్‌, రెన్యువల్స్‌కు పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ ఆమోదం తెలిపింది.

62 స్కానింగ్‌ కేంద్రాలకు ఆమోదం

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 3: జిల్లాలో 62 స్కానింగ్‌ కేంద్రాలకు కొత్తగా రిజిస్ర్టేషన్‌, రెన్యువల్స్‌కు పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ  ఆమోదం తెలిపింది. మంగళవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ  సమావేశం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కొత్తగా 30 స్కానింగ్‌ కేంద్రాలకు 32 కేంద్రాలకు రెన్యువల్‌ కమిటీ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో అడిషినల్‌ డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ, కమిటీ సభ్యులు డా.ఇందిర, డా.జీ.రమాదేవి, డా.మానస, ఎన్జీవోలు శ్రీనివాసులు, నాగరాజు, ఏ.లలిత, డెమో ప్రకా్‌షరాజ్‌, డిప్యూటీ డెమో ఎర్రంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T09:45:51+05:30 IST