-
-
Home » Andhra Pradesh » Kurnool » ap govt go in sugali preeti case
-
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎందుకూ పనికిరాదన్నారు: సుగాలి ప్రీతి తల్లి
ABN , First Publish Date - 2020-12-06T21:12:13+05:30 IST
2017లో జిల్లాలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని హత్యాచారం కేసులో సీబీఐ విచారణపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

కర్నూలు: 2017లో జిల్లాలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి హత్యాచారం కేసులో సీబీఐ విచారణపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతిబాయి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వం జీవో ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా కేసును సీబీఐ స్వీకరించకపోవడంతో ప్రీతిబాయి తల్లిదండ్రులు జనసేన పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ కార్యాలయంలో సంప్రదించారు. అయితే సీబీఐ అధికారులు ఇచ్చిన సమాధానంతో వారు షాక్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎందుకూ పనికిరాదంటూ సీబీఐ అధికారులు చెప్పారంటూ ప్రీతిబాయి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందంటూ.. ఆ జీవో ప్రతులను చించివేశారు. న్యాయం కోసం ఆందోళనలతో పాటు న్యాయపోరాటం చేస్తామని పార్వతి, జనసేన స్థానిక నేత యర్షద్ తెలిపారు.