వెండి పళ్లెం, నాగపడగ సమర్పణ

ABN , First Publish Date - 2020-10-19T11:11:43+05:30 IST

వెండి పళ్లెం, నాగపడగ సమర్పణ

వెండి పళ్లెం, నాగపడగ సమర్పణ

బనగానపల్ల్లె, అక్టోబరు 18: నందవరం చౌడేశ్వరీ మాత ఆలయానికి నందవరం గ్రామానికి చెందిన గోపిరెడ్డి నారాయణమ్మ, ఆమె కుమారుడు గోపిరెడ్డి ప్రసాద్‌రెడ్డి 980 గ్రాముల వెండి పళ్లెం, తీర్థం గిన్నె, ఇత్తడి గంటలను విరాళంగా అందించారని ఆలయ ఈవో రామానుజన్‌ తెలిపారు. వీటి విలువ రూ.60వేలు ఉంటుందని, తెలి పారు. ఆలయాభివృద్ధికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. 


పాణ్యం: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం భక్తులు వెండి నాగపడగను సమర్పించారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన జీసీఆర్‌ సూర్యనారాయణరెడ్డి, కుటుంబ సభ్యులు స్వామివారికి కిలో 380 గ్రాముల వెండి నాగపడగను ఆలయ ఈవో రామకృష్ణకు అందజేశారు. ఆలయ మర్యాదలతో దాతలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాదు, అర్చకులు నారాయణశర్మ, సురేష్‌శర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T11:11:43+05:30 IST