రూ.1.16 లక్షలు విరాళం
ABN , First Publish Date - 2020-10-19T11:10:21+05:30 IST
రూ.1.16 లక్షలు విరాళం

చాగలమర్రి, అక్టోబరు 18: చాగలమర్రి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రులు సందర్భంగా ఉభయదారులు శాశ్వత నిత్యపూజ చేసేందుకు ఆర్.సుబ్బరావు, సతీమణి వరలక్ష్మీదేవి, తనయుడు సంతోష్‌కుమార్ రూ.1.16 లక్షలు విరాళమిచ్చారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేశారు. దాతలను ఆలయ అధ్యక్షుడు సుంకు జనార్దన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు కృష్ణం శివప్రసాద్, మల్లికార్జున, లక్ష్మీనారాయణ, నవతా ప్రసాద్, శేఖర్, నాగేంద్రకుమార్, పృథ్వీనాథ్, వెంకటేశ్వరబాబు, భాస్కర్, నాగేంద్రగుప్త పాల్గొన్నారు.