మల్లన్న సన్నిధిలో పరిటాల సునీత
ABN , First Publish Date - 2020-10-19T11:09:45+05:30 IST
మల్లన్న సన్నిధిలో పరిటాల సునీత

కర్నూలు(అర్బన్), అక్టోబరు 18: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మాజీ మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆమెకు ఈవో కేఎస్ రామరావు ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు దేవీనవరాత్రి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నట్లు పరిటాల సునీత తెలిపారు. ఆమె వెంట వడ్లమూడి శైలజ తదితరులు పాల్గొన్నారు.