గుప్త నిధులు పేరిట మోసం

ABN , First Publish Date - 2020-09-21T10:48:14+05:30 IST

గుప్త నిధులు పేరిట మోసం

గుప్త నిధులు పేరిట మోసం

రూ.13.5 లక్షలు టోకరా

 పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 


ఆత్మకూరు, సెప్టెంబరు 20: గుప్తనిధులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ అమాయకుడి నుంచి రూ.13.5లక్షలు టఓకరా వేసిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.ట ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు అనే వ్యాపారి వద్దకు 2017లో కొందరు వ్యక్తులు వచ్చి గుప్తనిధులు ఇప్పిస్తామని నమ్మబలికారు. కొత్తపల్లి మండలంలోని ఓ పొలంలో  నిధిని బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉందని, అందుకు కొంత సొమ్ము ఖర్చవుతోందని చెప్పారు. గుప్తనిధులపై అత్యాశతో శ్రీనివాసులు కొంత మొత్తం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు అవసరం ఉందని ఆ వ్యక్తులు పలుమార్లు వ్యాపారి నుంచి సుమారు రూ.13.5 లక్షల వరకు వసూలు చేశారు. అంతడబ్బు తనవద్ద లేకున్నప్పటికీ గుప్తనిధుల కోసం అప్పుచేసి మరీ వారికి సొమ్ము ఇచ్చారు. మూడేళ్లు దాటినా గుప్తనిధులు ఇవ్వకపోగా.. సొమ్మును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనను బెదిరించారని బాధితుడు శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు స్థానికంగా ఉన్నప్పటికీ మరో వ్యక్తి బళ్లారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


గుప్త నిధుల కోసం విగ్రహం ధ్వంసం

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 20: మండలంలోని చిన్నకందుకూరు గ్రామ సమీపంలోని కాళభైరవస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాళం వేసిన తలుపులను పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. శనివారం రాత్రి పొద్దు పోయాక ఈ ఘటన జరిగింది. ముందుగా దుండగులు స్వామికి పూలదండ వేసి, కొబ్బరి కాయ కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత ఐదారేండ్ల క్రితం కూడా దుండగులు విగ్రహం ఇలాగే జరిగింది. విగ్రహంలోని ఓ భాగాన్ని క్షుద్ర పూజలకు ఉపయోగించి దుండగులు అనుకున్న చోట గుప్తనిధులు సులభంగా బయట పడతాయన్న అభిప్రాయంతో తీసుకెళ్లి ఉంటారని ఆలయ పూజారి వెంకట శాస్త్రి తెలిపారు. 

Updated Date - 2020-09-21T10:48:14+05:30 IST