సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి ఆభరణాల సమర్పణ

ABN , First Publish Date - 2020-09-21T10:47:37+05:30 IST

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి ఆభరణాల సమర్పణ

సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి ఆభరణాల సమర్పణ

పాణ్యం, సెప్టెంబరు 20: మండలంలోని ప్రముఖశైవ క్షేత్రమైన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఆలయ ఈవో రామకృష్ణకు ఇచ్చారు. నంద్యాల పట్టణం టెక్కెకు చెందిన చిలకల మల్లికార్జున 3.119 కిలోల వెండి నాగ పడగను ఇచ్చారు. నంద్యాల మండలం పుసులూరు గ్రామానికి చెందిన భవనాశి నాగరాజు 1.9 కిలోల వెండిపల్లెం, నాగాభరణం, బనగానపల్లె కు చెందిన సుబ్రహ్మణ్యం 1.085 కిలోల వెండి నాగ పడగ, కల్లూరు మండలం దూపాడు గ్రామానికి చెందిన ఎన్‌. పుల్లారెడ్డి 1. 280 కిలోల వెండి నాగపడగను బహూకరించారు. పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన గుద్దేటి లక్ష్మయ్య 10 గ్రాముల బంగారు గొలుసును విరాళంగా అందజేశారు. భక్తులు రూ.5.5 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఇచ్చారు. ఈవో ఆలయ మర్యాదలతో స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ార్యక్రమంలో అర్చకులు నారాయణశర్మ, సురేష్‌ శర్మ, సుబ్బారెడ్డి, ప్రసాదు, అలయ సిబ్బందిపాలొన్నారు. 

Updated Date - 2020-09-21T10:47:37+05:30 IST