స్వాతి జన్మ నక్షత్ర పూజలు

ABN , First Publish Date - 2020-09-21T10:46:43+05:30 IST

స్వాతి జన్మ నక్షత్ర పూజలు

స్వాతి జన్మ నక్షత్ర పూజలు

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 20: నంద్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర మైన స్వాతి సందర్భంగా ప్రత్యేపూజలు, అర్చనలు, పంచామృతాభిషేకం నిర్వహింంచారు. మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీరామమూర్తి, నిర్వహకులు మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.


బేతంచెర్ల: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలును ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ఉషోదయ కాలంలో విశ్వకేశారాధన, వాసుదేవ పుణ్యహవాచనం, నవ కలశారాధన, ఆదివాస సుదర్శనహోమం, మహా పూర్ణాహుతి, అవభృత స్నానం, విశేష తిరుమంజనం, శంకుచక్రధర అభిషేకాలను వేద పండితుడు జ్వాలా చక్రవర్తి, అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ సీహెచ్‌ లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో స్వాతి నక్షత్ర వేడుకలు నిర్వహించారు. ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-21T10:46:43+05:30 IST