‘వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి’
ABN , First Publish Date - 2020-12-30T05:22:20+05:30 IST
రైతాంగానికి ఉరితాడుగా మారిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగన్న డిమాండ్ చేశారు.
ఓర్వకల్లు, డిసెంబరు 29: రైతాంగానికి ఉరితాడుగా మారిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సోమన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముర్తుజావలి, షాజాహాన్, మల్లేష్, చాంద్‌బాషా, మధు, ఎర్రమల, షాలీబాషా, దస్తగిరి పాల్గొన్నారు.
నంద్యాల: దేశంలో వ్యవసాయ రంగానికి, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా నాల్గవ రోజు రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్షను రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు సోమన్న ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాబాఫకృద్దీన్, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహులు, మండల సీపీఎం అధ్యక్షుడు సద్దాం హుసేన్, ఏఐటీయుసీ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.