రాజధాని రైతుల గోడు పట్టదా?

ABN , First Publish Date - 2020-12-17T05:30:00+05:30 IST

అమరావతి రాజధాని రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి ప్రశ్నించారు.

రాజధాని రైతుల గోడు పట్టదా?
ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

  1.  రైతులకు మద్దతుగా టీడీపీ ర్యాలీ, ధర్నా


పత్తికొండ, డిసెంబరు 17: అమరావతి రాజధాని రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి ప్రశ్నించారు. రాజధాని రైతుల దీక్షలు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మద్దతుగా గురువారం పత్తికొండలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఏడాదిగా శాంతియుత పోరాటాలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ఏకీభవించిన సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరిట అమరావతి నిర్మాణానికి అడ్డంకులు ఏర్పరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ కర్నూలు లోక్‌సభ ప్రధాన కార్యదర్శి సుకన్యాదేవి, టీడీపీ నాయకులు మనోహర్‌చౌదరి, చల్లా రవీంద్రనాథ్‌చౌదరి, రామానాయుడు,  బీటీ గోవిందు, ధనుంజయుడు, తిమ్మయ్యచౌదరి, ఈశ్వరప్ప, శ్రీనివా్‌సగౌడ్‌, రవీంద్రనాయక్‌, సింగం శీను, ఫకృద్దీన్‌, హరినాథ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-17T05:30:00+05:30 IST