‘మురుగునీటి శుద్ధికి రూ.57.60 కోట్లు’

ABN , First Publish Date - 2020-12-04T05:11:39+05:30 IST

మున్సిపా ల్టిలలో మురుగు నీటి శుద్ధికి ప్రభుత్వం రూ.57.60 కోట్లు మంజూరు చేసిందని మున్సిపాలిటీల రాయలసీమ రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు తెలిపారు.

‘మురుగునీటి శుద్ధికి రూ.57.60 కోట్లు’

ఆళ్లగడ్డ, డిసెంబరు 3: మున్సిపా ల్టిలలో మురుగు నీటి శుద్ధికి ప్రభుత్వం రూ.57.60 కోట్లు మంజూరు చేసిందని మున్సిపాలిటీల రాయలసీమ రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు తెలిపారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఆర్డీ మాట్లాడుతూ మున్సిపాల్టిలలోని మురుగు నీరంతా సమీపంలోని వాగులు, వంకలు, నదుల్లో నేరుగా కలవడంతో వాటి నీరంతా కలుషితం అవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, మడకశిర మున్సిపాలిటీలలో మురికి నీరు శుద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ విధి, విధానాలను పాటించాలని, తడి, పొడి చెత్తలను వేరు చేయాలని ఆయన మున్సిపాలిటీ కమిషర్లను ఆదేశించారు. లేని పక్షంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఒక్కొక్క మున్సిపాలిటీ స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మున్సిపాల్టిలలో విద్యుత్‌ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర అధికారులకు నివేదిస్తామన్నారు. కమిషనర్‌ రమేష్‌బాబు ఉన్నారు.

Updated Date - 2020-12-04T05:11:39+05:30 IST