మద్యం, సారా స్వాధీనం
ABN , First Publish Date - 2020-05-29T10:42:40+05:30 IST
జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సారా స్థావరాలపై దాడులు చేశారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
నిందితుల అరెస్టు, వాహనాల సీజ్
ఆదోని(అగ్రికల్చర్), మే 28: జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సారా స్థావరాలపై దాడులు చేశారు. భారీగా మద్యం, సారా, గుట్కాను స్వాధీనం చేసుకుని నిందితులపు అరెస్టు చేశారు. అలాగే వాహనాలను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి లారీలో ఖాళీ సంచుల కింద కర్ణాటక మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న లారీపై గురువారం రాత్రి డీఎస్పీ రామకృష్ణ, వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ప్రహ్లాద దాడులు చేశారు. ఆదోని పట్టణంలోని ఫ్లైవోర్ బ్రిడ్జీ కింద ఓ హీరో షోరూం వద్ద లారీని పోలీసులు తనిఖీలు చేశారు. కర్ణాటకకు చెందిన రూ.3 లక్షల విలువ చేసే మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ బషీర్, లారీ ఓనర్ షరీఫ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మండలంలోని దిబ్బనకల్లు గ్రామ శివారు నల్లగుండ్ల ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది గురువారం దాడులు చేశారు. నాటుసారా తయారీ బట్టీలను ధ్వంసం చేసి 600 లీటర్ల బెల్లపుఊటను పారబోశారు. ఇందిరానగర్‌కు చెందిన వీరే్షపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ రమే్‌షరెడ్డి, ఎస్ఐ రమే్‌షబాబు పాల్గొన్నారు.
పట్టణ శివారు ప్రాంతంలో శిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద బైక్‌పై గుట్కా రవాణా చేస్తున్న వక్తులను అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్ఐ ప్రహ్లాద దాడులు చేపట్టారు. కర్ణాటక నుంచి బైక్‌పై పట్టణానికి చెందిన సమీర్‌బాషా, కుర్షిన్అహ్మద్ అనే వ్యక్తులు రూ.10,070 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నందెప్పతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ గురువారం తెలిపారు. 143 కర్ణాటక మద్యం బాటిళ్లు, నాలుగు ఫుల్ బాటిళ్లు, 30 లీటర్ల నాటుసారా, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
హాలహర్వి: హాలహర్వి మండలం ఛత్రగుడి చెక్‌పోస్టు వద్ద భారీగా కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలనర్సింహులు, సీఐ భాస్కర్ తెలిపారు. గురువారం ఎస్ఐ బాలనర్సింహులు ఆధ్వర్యంలో కర్ణాటక మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచామని, చెక్‌పోస్టు వద్ద, రహదారులపై దాడులు నిర్వహించారు. కారులో 1366 మద్యం బాటిళ్లు, రెండు ట్రక్కులలో 26 మద్యం బాటిళ్లు, రెండు ద్విచక్ర వాహనాల్లో 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు.
ఆలూరు: ఆలూరు ఎక్సైజ్ పరిధిలోని కొక్కరచేడు గ్రామానికి చెందిన వీరేష్, మల్లికార్జున, బేతంచెర్లకు చెందిన రాంగోపాల్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. 574 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రాలయం: తుంగభద్ర నది ద్వారా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం 740 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కృష్ణయ్య గురువారం తెలిపారు. పెద్దకడబూరు మండలం హెచ్ మురవాణి గ్రామానికి చెందిన సాయినాథ్ గౌడ్, మరొక వ్యక్తి బైక్‌పై మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. ఎస్ఐ వేణుగోపాల్‌రాజు, హెచ్‌సీ జయన్న, సీపీవోలు నవీన్, పాల్గొన్నారు.
గోనెగండ్ల: మండలంలోని గంజహళ్లి గ్రామంలో కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న బోయ కౌలుట్లయ్యను అరెస్టు చేసి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు.
నందవరం: మండలంలోని పెద్దకొత్తిలి బస్టాండ్ వద్ద ఎమ్మిగనూరుకు చెందిన ఆంజనేయులు, మారెప్ప, చిన్న ఆంజనేయులు తెలంగాణ నుంచిమద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎమ్మిగనూరు సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. సోమలగూడురు గ్రామ సమీపంలో గోనెగండ్ల మండలం చిన్నమరివీడుకు చెందిన ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని, డైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన గోపాల్, నాగలదిన్నె గ్రామనికి చెందిన రామాంజిని తెలంగాణ నుంచి 80 సీసాల మద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హెచ్‌సీ ఆంజినేయులు, సుంకన్న, రాముడు పాల్గొన్నారు.
కోసిగి: మండలంలోని కోల్మాన్ పేట గ్రామానికి చెందిన బోయ మహదేవ నుంచి కర్ణాటక మద్యం 192 విస్కీ 90ఎంఎల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, టీవీఎస్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఈబీ సీఐ లక్ష్మీదేవి, ఎస్ఐ అఖిల అన్నారు.
కొత్తపల్లి: మండంలోని సంగమేశ్వరం వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన 4 ఫుల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్‌బాబు తెలిపారు. మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన కదిరి సుబ్బన్న బైక్‌పై తరలిస్తుండగా అరెస్టు చేసి బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
దేవనకొండ: పత్తికొండ రూరల్ సీఐ ఆధ్వర్యంలో దేవనకొండ ఎస్ఐ నరింహులు మండలంలోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. తెర్నేకల్‌లో రంగస్వామి, మారాజు వద్ద నుంచి 20 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పి.కోటకొండ గ్రామానికి చెందిను చిన్నమహానంది ఇంటి దగ్గర 10 లీటర్లసారాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పత్తికొండ రూరల్: మండలంలోని మర్రిమాన్తండా గ్రామంలో నాటుసారా స్థావరాలపై సీఐ ఆదినారాయణరెడ్డి, ఎస్ఐ గుర్రప్ప ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బెల్లంఊట ధ్వంసం చేశారు. గురువారం గిరిజన గ్రామాల్లో ఇళ్లవద్దే నాటుసారా తయారు చేస్తున్న బట్టీలు, బెల్లంఊటను ధ్వంసం చేశారు.