నెలాఖరు వరకు దర్శనాలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-07-14T10:57:22+05:30 IST

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు మఠం ..

నెలాఖరు వరకు దర్శనాలు నిలిపివేత

ఆళ్లగడ్డ, జులై 13: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు మఠం మేనేజర్‌ శ్రీవైకుంఠ స్వామి సోమవారం తెలిపారు. ఓ అర్చకుడికి గత నెలలో కరోనా సోకడంతో ఈ నెల 15 వరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించామన్నారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేశామని, భక్తులు సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-07-14T10:57:22+05:30 IST