అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు

ABN , First Publish Date - 2020-12-30T05:35:57+05:30 IST

జిల్లాలో ఉన్న 3549 అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు మంజూరైనట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేఎస్‌ భాగ్యరేఖ తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 29:  జిల్లాలో ఉన్న 3549 అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు మంజూరైనట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేఎస్‌ భాగ్యరేఖ తెలిపారు. జిల్లాలోని ఉన్న 3486 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కిట్‌కు 15 రకాల మందులు, సిర్‌పలు, ఆయింట్‌మెంట్లు, ఆల్బెండజోల్‌ మాత్రలు, జ్వరం మాత్రలు, చర్మవ్యాధికి లోషన్‌లు ఉంటాయని తెలిపారు. ఏపీఎంఎ్‌సఐడీసీ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ డోర్‌ డెలివరీ వాహనం ద్వారా సోమవారం 1000 మెడికల్‌ కిట్లను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపినట్లు ఫార్మసిస్టు రమేష్‌ తెలిపారు.

Updated Date - 2020-12-30T05:35:57+05:30 IST