వేదవతి ప్రాజెక్టు పూర్తయితే... మంత్రి

ABN , First Publish Date - 2020-12-12T05:00:58+05:30 IST

కరువు నేల సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

వేదవతి ప్రాజెక్టు పూర్తయితే... మంత్రి
మాట్లాడుతున్న మంత్రి గుమ్మనూరు జయరాం


హాలహర్వి, డిసెంబరు 11: కరువు నేల సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం నిట్రవట్టి గ్రామంలో వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి రూ.1600 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఎత్తిపోతల పథ కం ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందించడం జరుగుతుందని, రెండు జలాశయాలు నిర్మించడానికి రైతులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ తాలుకా ఇన్‌చార్జి నారాయణస్వామి, మండల కన్వీనర్‌ భీమప్పచౌదరి, జడ్పీటీసీ అభ్యర్థి లింగన్న, లక్ష్మన్న, చింతకుంట సొసైటీ చైర్మన్‌ శ్రీనివాసులు, వెకంటేశ్‌, కురువ లింగన్న పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:00:58+05:30 IST