అదనపు కట్నం కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-28T11:02:06+05:30 IST

మండలంలోని గూటుపల్లె గ్రామానికి చెందిన యాపదిన్నె విజయలక్ష్మి అనే మహిళను ఆమె భర్త దాసరి అశోక్‌ అదనపు కట్నం ..

అదనపు కట్నం కేసు నమోదు

బేతంచెర్ల, జూలై 27: మండలంలోని గూటుపల్లె గ్రామానికి చెందిన యాపదిన్నె విజయలక్ష్మి అనే మహిళను ఆమె భర్త దాసరి అశోక్‌ అదనపు కట్నం తీసుకరావాలని వేధింపులకు గురి చేస్తున్నాడని హెడ్‌కానిస్టేబుల్‌ బాలాజిసింగ్‌ సోమవారం తెలిపారు. గూటుపల్లె గ్రామానికి చెందిన విజయలక్ష్మితో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన దాసరి అశోక్‌తో గతేడాది క్రితం వివాహమైంది. వివాహ సమయంలో తులం బంగారు, రూ.70వేలు క ట్నం ఇచ్చారని, భర్త అశోక్‌ అదనపు కట్నం తీసుకరావాలని మానసికం గా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలి ఫిర్యా దు మేరకు భర్త అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.  

Updated Date - 2020-07-28T11:02:06+05:30 IST