మరో ముగ్గురికి కొవిడ్‌

ABN , First Publish Date - 2020-05-18T09:54:24+05:30 IST

జిల్లాలో మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. బాధితుల సంఖ్య 611కు చేరింది

మరో ముగ్గురికి కొవిడ్‌

28 మంది డిశ్చార్జి

యాక్టివ్‌ కేసులు 159 


కర్నూలు(హాస్పిటల్‌)/నంద్యాల, మే 17: జిల్లాలో మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. బాధితుల సంఖ్య 611కు చేరింది. కొత్త కేసుల్లో కర్నూలు నగరంలో రెండు, ఆదోని మండలంలో ఒకటి (లారీ డ్రైవర్‌) ఉన్నాయి. జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 28 మందిని వైద్యులు ఆదివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. చైతన్య కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఏడుగురు, నంద్యాల శాంతిరాం కొవిడ్‌ ఆసుపత్రి నుంచి 14 మంది, విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ముగ్గురు, కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి నలుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.


వీరిలో 15 మంది పురుషులు, 13 మంది మహిళలు. కర్నూలు నగర వాసులు 14 మంది, నంద్యాల పట్టణ వాసులు 10 మంది, కోవెలకుంట్ల, చాగలమర్రి వాసులు ఒక్కొక్కరు, నంద్యాల మండలం చాబోలుకు చెందిన ఒకరు, అవుకు మండలం చెరువులోపల్లికి చెందిన ఒకరు, శిరివెళ్లకు చెందిన ఒకరు  ఉన్నారు. కోలుకున్న వారిలో పది మంది బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు. వీరి వయసు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండటం విశేషమని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. డిశ్చార్జి అయిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున రూ.2 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జిల్లాలో కోలుకున్న వారి సంఖ్య 433కు చేరింది. 159 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-05-18T09:54:24+05:30 IST