నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2020-12-31T05:00:47+05:30 IST

నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎస్పీ


ఆదోని, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లఓ విలేఖరులతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. యువత పెడదోవనపడుతూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ఎవరైనా ప్రవర్తించినా అటువంటి వారిపై చట్టరిత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత అత్యుత్సాహంతో ద్విచక్ర వాహనానికి సైలెన్సర్‌ తీసేసి పెద్ద శబ్ధాలతో వెళ్లడం, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం, కేకలు వేస్తూ వెళ్లడం లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉంటుందన్నారు. ఎక్కడికక్కడే పోలసీఉలు నిఘా ఉంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కేక్‌లు కట్‌ చేస్తూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతం పలకాలన్నారు. యువత పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించరాదని, బార్లు, వైన్‌షాపులు, రెస్టారెంట్లు, ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసివేయాలన్నారు. ఆ తర్వాత తెరిచి ఉంచితే జరిమానా తప్పదని హెచ్చరించారు. సమావేశంలో వన్‌టౌన్‌, టూటౌన్‌, త్రీటౌన్‌, ట్రాపిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐలు చంద్రశేఖర్‌, శ్రీరాములు, నరేష్‌బాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:00:47+05:30 IST