పాలేరుతో భర్తనే చంపించింది
ABN , First Publish Date - 2020-12-12T05:09:46+05:30 IST
మండలంలోని నగల్లపాడు గ్రామ సమీపంలో భవనాశి వద్ద ఈనెల 3వ తేదీన కృష్ణకిషోర్(44) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
చాగలమర్రి, డిసెంబరు 11: మండలంలోని నగల్లపాడు గ్రామ సమీపంలో భవనాశి వద్ద ఈనెల 3వ తేదీన కృష్ణకిషోర్(44) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణకిషోర్ భార్య భాగ్యలక్ష్మిని, పాలేరు నరసింహుడుని అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ తెలిపారు. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లె గ్రామానికి చెందిన కృష్ణకిషోర్ అప్పులు చేసి నిత్యం భార్యపై అనుమానంతో వేధిస్తుండేవాడు. సమయం దొరికినప్పుడు తన భర్తను చంపమని భాగ్యలక్ష్మి నరసింహుడికి చెప్పింది. కృష్ణకిషోర్‌కు మద్యం తాపించి మండలంలోని నగల్లపాడు సమీపంలో భవనాశి వాగు నీటిలోకి తోసేయడంతో ఊపిరాడక చనిపోయాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ మారుతి, పోలీసులు ఉన్నారు.