-
-
Home » Andhra Pradesh » Kurnool » a person suicide
-
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-10T05:40:47+05:30 IST
మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన శేఖర్ (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు.

గడివేముల, డిసెంబరు 9: మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన శేఖర్ (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల మేరకు వారం రోజుల క్రితం శేఖర్, అతడి భార్య గొడవపడ్డారని అన్నారు. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రాక పోవడంతో శేఖర్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడని తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.