చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-25T06:03:02+05:30 IST

మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన చిలకల పెద్ద బిజ్జి తిమ్మయ్య(57) అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శిరివెళ్ల, నవంబరు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన చిలకల పెద్ద బిజ్జి తిమ్మయ్య(57) అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఎస్‌ఐ సూర్యమౌలి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారెల్ల శివ అనే వ్యక్తి ఈ నెల 22న తన ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్‌ ట్రాలీలో నిలబడి ఉన్న పెద్ద బిజ్జి తిమ్మయ్య కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో నంద్యాల వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కుమారుడు బిజ్జి తిమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more