కేసీలో బాలిక గల్లంతు
ABN , First Publish Date - 2020-12-06T05:19:04+05:30 IST
మండలంలోని సాంబవరం గ్రామానికి చెందిన దాసరి నాగరాజు కుమార్తె ఉష (13) కేసీకెనాల్‌లో గల్లంతైనట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

గోస్పాడు, డిసెంబరు 5: మండలంలోని సాంబవరం గ్రామానికి చెందిన దాసరి నాగరాజు కుమార్తె ఉష (13) కేసీకెనాల్‌లో గల్లంతైనట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. దుస్తులు ఉతుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.