లోక్‌ అదాలత్‌లో 926 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2020-12-13T06:03:52+05:30 IST

జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 926 కేసులు పరిష్కారమ య్యాయి.

లోక్‌ అదాలత్‌లో 926 కేసుల పరిష్కారం
లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న న్యాయమూర్తులు

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 12: జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 926 కేసులు పరిష్కారమ య్యాయి. నగరంలోని న్యాయసేవా సదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వి. రాధాకృష్ణ కృపాసాగర్‌ ఆధ్వర్యంలో 20 బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించారు. కర్నూలులో 240 కేసులు, ఆదోనిలో 28, ఆళ్లగడ్డలో 46, ఆలూరులో 40, ఆత్మకూరులో 16, బనగానపల్లెలో 30, డోన్‌లో 35, కోవెలకుంట్లలో 31, నందికొట్కూరులో 31 కేసులు, నంద్యాలలో 321, పత్తికొండలో 76, ఎమ్మిగనూరులో 32 కేసులు పరిష్కారమయ్యాయి. మోటార్‌ వాహన ప్రమాదాల కేసులలో రూ.4,33,22,000 నష్టపరిహారం చెల్లించేలా న్యాయమూర్తులు కృషిచేసి బీమా కంపెనీలను ఒప్పించారు. 

Updated Date - 2020-12-13T06:03:52+05:30 IST