ఓటు 6 రకాలు

ABN , First Publish Date - 2020-03-12T11:07:55+05:30 IST

ఓటరు జాబితాలో పేరున్న సాధారణ పౌరులు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేస్తారు. దీన్ని సాధారణ ఓటుగా పరిగణిస్తారు.

ఓటు 6 రకాలు


కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 11: 


 రాజ్యాంగం    6 రకాల ఓట్లను నిర్వచించింది. అవి..


ఓటరు జాబితాలో పేరున్న సాధారణ పౌరులు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేస్తారు. దీన్ని   సాధారణ ఓటుగా పరిగణిస్తారు.


ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది వేసే ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌గా పిలుస్తారు.


దేశ సైనికులు, పారా మిలటరీ ఉద్యోగులు వేసే ఓటును సర్వీస్‌ ఓటు అంటారు. 


ఇంటిలిజెన్స్‌, గూఢచారి సిబ్బంది నేరుగా ఓటు వేసే అవకాశం ఉండదు. వారికి బదులుగా వారి ప్రతినిధి వేసే ఓటును ప్రాక్సీఓటు అని పిలుస్తారు.


పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సమయానికి మన ఓటు వేరే వ్యక్తులు వేసినట్లు తెలిస్తే సంబంధిత పోలింగ్‌ అధికారిని సంప్రదించి వేసే ఓటును టెండర్‌ ఓటు అని పిలుస్తారు. 


మనం ఓటు వేయటానికి వెళ్లే సమయంలో పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయకుండా అధికారులు లేదా ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే పోలింగ్‌ అధికారిని సంప్రదించి నిర్ణీత రుసుం చెల్లించి వేసే ఓటును చాలెంజ్‌ ఓటు అని పిలుస్తారు. 

Updated Date - 2020-03-12T11:07:55+05:30 IST