నంద్యాల వైద్య కళాశాలకు 50 ఎకరాలు

ABN , First Publish Date - 2020-11-06T06:56:18+05:30 IST

నంద్యాల వైద్య కళాశాలకు 50 ఎకరాలు

నంద్యాల వైద్య కళాశాలకు 50 ఎకరాలు

కర్నూలు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం నంద్యాల మండలం నూనెపల్లెలో 50 ఎకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. గురువారం సీఎం జగన్‌అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండలిపలు నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడిస్తూ నంద్యాలలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కళాశాలకు 50 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే మెరుగైన ఇసుక విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక రీచ్‌లను మూడు మండలాలుగా విభజిస్తున్నట్లు, కర్నూలు మూడో మండలం కిందికి వస్తుందని ఆయన తెలిపారు.  

Updated Date - 2020-11-06T06:56:18+05:30 IST