జిల్లాలో 45 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-14T05:28:56+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7,300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 45 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జిల్లాలో 45 కరోనా కేసులు

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 13: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7,300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 45 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 59,896కు చేరింది. వీరిలో 296 మంది చికిత్స పొందుతుండగా 59,118 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరణాలు సంభవించలేదు.

Updated Date - 2020-11-14T05:28:56+05:30 IST