జిల్లాలో 36 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-13T06:06:54+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 36 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 12: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 36 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 59,851కు చేరింది. వీరిలో 286 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.