-
-
Home » Andhra Pradesh » Kurnool » 35 THOUSAND CROSED
-
35 వేలు దాటాయ్
ABN , First Publish Date - 2020-08-20T11:12:47+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు 35 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 734 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పాజిటివ్ బాధితుల సంఖ్య 35576కు చేరిం

గడచిన 24 గంటల్లో 734 కరోనా కేసులు
మరో ఇద్దరి మృతి.. 308కి చేరిన మరణాలు
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 19: జిల్లాలో కరోనా కేసులు 35 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 734 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పాజిటివ్ బాధితుల సంఖ్య 35576కు చేరింది. వీరిలో 7,234 మంది చికిత్స పొందుతుండగా, 28034 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 308కి చేరింది.
బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంలో మద్దిలేటి నరసింహ స్వామి దేవాలయంలో నలుగురు సిబ్బందికి కరోనా వచ్చింది. దీంతో ఆలయాన్ని రెండు రోజులు మూసివేస్తున్నట్లు ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్ లక్ష్మిరెడ్డి తెలిపారు.
పగిడ్యాల పీహెచ్‌సీలో 38 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి బలరాం నాయక్ తెలిపారు.
ఆదోని మున్సిపాలిటీ పరిధిలో 9, రూరల్‌లో 8 పాజిటివ్ కేసులు వచ్చాయి.