నడకతో ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-12-14T05:21:46+05:30 IST
నడకతోనే ఆరోగ్యమని, ప్రతి ఒక్కరూ 45 నిమిషాలు నడవాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీ.నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

- 2కే రన్‌ను ప్రారంభించిన పెద్దాసుపత్రి సూపరింటెండెంట్
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 13: నడకతోనే ఆరోగ్యమని, ప్రతి ఒక్కరూ 45 నిమిషాలు నడవాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీ.నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో ధన్వంతరీ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నగరంలో 2కే రన్‌ను సూపరింటెండెంట్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయామం, నడక, యోగా, ధ్యానం చేసిన వారికి కరోనా సోకలేదని, శారీరక శ్రమ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ విభాగ ప్రచారకుడు సురేంద్ర మాట్లాడుతూ చీమలాగా నిరంతరం పని చేస్తే అనారోగ్యం దరి చేరదన్నారు. అనంతరం 150 మందితో 2 కి.మీలు పరుగు నగరంలోని రాజ్‌విహార్, వివేకానంద సర్కిల్ నుంచి ధన్వంతరీ వరకు పరుగు సాగింది. ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షుడు డా.ధ్వారాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బి.సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, డా.ఎండీవీఎన్ రామశర్మ, హెచ్‌ఎం కోదండరాం పాల్గొన్నారు.