-
-
Home » Andhra Pradesh » Kurnool » 23 nuchi dead exams
-
23 నుంచి డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు
ABN , First Publish Date - 2020-11-27T05:57:03+05:30 IST
2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ బ్యాచ్ డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు డిసెంబరు 23 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), నవంబరు 26: 2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ బ్యాచ్ డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు డిసెంబరు 23 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతాయన్నారు.
గెస్టు ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు
కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం, వాణిజ్య శాస్త్రం, వృక్ష శాస్త్రం (ఉర్దూ మీడియం) బోధించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.లాలెప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ లోపుల దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఈనెల 30న ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.